ఆంధ్రప్రదేశ్
16 కు చేరిన టిడిపి కౌన్సిలర్ల సంఖ్య
ఏపీ టుడే న్యూస్,
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
కడప జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. తాజాగా మంగళవారం ఉదయం వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు ఇరువురు ఆ పార్టీని వీడి నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పుకున్నారు. వైసీపీని వీడిన మున్సిపల్ వార్డు కౌన్సిలర్ లలో 38వ వార్డు కౌన్సిలర్ రమాదేవి, 14వ వార్డు కౌన్సిలర్ జిలాని భాష ఉన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే వరద, టిడిపి రాష్ట్ర నాయకులు సీఎం సురేష్ నాయుడు, వి.ఎస్ ముక్తియర్, సమక్షంలో టిడిపిలో చేరగా, రానున్న రోజుల్లో మరి కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి టిడిపిలోకి చేరనున్నట్లు తెలియవస్తోంది. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు, తమ వార్డులలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎమ్మెల్యే వరద కృషి చేస్తున్న కారణంగా తాము టిడిపి వైపు మొగ్గు చూపినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పలువురు ముఖ్య టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 138063