ఆంధ్రప్రదేశ్
గాంధీజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం ఎన్ఎండి ఫిరోజ్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి.
దివ్యాంగులకు నెల వారి మందుల పంపిణీ.
గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, యువనేత ఎన్.ఎం.డి. ఫిరోజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ సౌజన్యంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారి అందించే మందులను ఫిరోజ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎన్.ఎం.డి. ఫిరోజ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం యువతకు స్ఫూర్తి దాయకమన్నారు. ఈరోజు దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి సహకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల నుండి ఆరు వేల రూపాయలకు పెంచిన విషయం గుర్తు చేశారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో దివ్యాంగుల సంక్షేమ సంఘం, ఐఎంఏ ,లయన్స్ క్లబ్ ల తరపున సేవా కార్యక్రమాల్ని భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులు కార్యాలయంలో సంప్రదిస్తే ప్రతి నెల వారికి అవసరమైన మందులను కొనుగోలు చేసి ఉచితంగా అందజేస్తామన్నారు. దివ్యాంగులు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎన్.ఎం.డి.ఫిరోజ్ కు దివ్యాంగుల సంక్షేమం సంఘం, లయన్స్ క్లబ్ ఆత్మీయ సత్కారం చేసి జ్ఞాపిక, మహాత్మా గాంధీ ఆత్మకథ గ్రంథం అందజేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నిజాముద్దీన్, శిరిగిరి రమేష్ ,కోశాధికారి మామిళ్ల నాగరాజు, జిల్లా చైర్మన్ ఎం.పీ.వి. రమణయ్య,మాజీ అధ్యక్షులు బాల అకాడమీ రవీంద్రనాథ్, ఉపాధ్యక్షులు సోమేశుల నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు మిద్దె చిన్న హుసేని,యువజన నాయకులు కామిని మల్లికార్జున,దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, నంద్యాల జిల్లా సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు ,దివ్యాంగులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక