ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగు ఎల్ఐసి కార్యాలయంలో … -ఘనంగా జాతిపిత జయంతి మహోత్సవం -ఘనంగా లియాఫీ 61వ ఆవిర్భావ దినోత్సవం (వీడియో)
ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
జమ్మలమడుగు(అక్టోబర్02):
జమ్మలమడుగు పట్టణంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) కార్యాలయ ఆవరణంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు బ్రాంచ్ మేనేజర్ సేల్స్ కృష్ణారెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో లియాఫీ యూనియన్ నాయకుల అధ్యక్షతన ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవ వేడుకలు నిర్వహించారు. లియాసి 61 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మొదటగా జాతిపిత చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం పాత బస్టాండ్లో ఉన్న గాంధీ విగ్రహానికి, పూలమాలవేసి లియాఫీ నాయకులు, బ్రాంచ్ అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం సాధించడంలో జాతిపిత మహాత్మా గాంధీ సేవలు చిరస్మరణీయమని అలాంటి మహోన్నత వ్యక్తులను స్మరించుకోవడం గర్వంగా ఉందన్నారు. అనంతరం లియాఫీ జమ్మలమడుగు బ్రాంచ్ సెక్రటరీ గురు శేఖర్ మాట్లాడుతూ 1964,అక్టోబరు 2వ తేదీన లియాపీ ఆవిర్భావం జరిగిందని, దీనిద్వారా ఏజెంట్ల హక్కులకోసం యూనియన్ పోరాటం చేస్తుందన్నారు. ఏజెంట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచడంలో గానీ, గ్రాట్యుటీ, పెన్షన్, మెడికల్ బిల్లుల అమలు వంటి వాటిలో యూనియన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. నిరంతరం ఏజెంట్ల హక్కుల సాధన కోసం లియాఫీ యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎల్ఐసి ఉద్యోగులు, లియాఫీ ట్రెజరర్ గోపాల్ రెడ్డి, యూనియన్ నాయకులు బేపారి మహమ్మద్ మజహర్ అలీ, జి.రాధాకృష్ణ, విశ్వేశ్వరయ్య ,ఓం నమశ్శివాయ, బి రామ సుబ్బారెడ్డి, బి రామకృష్ణారెడ్డి, ఏజెంట్లు, హరిత , దివ్య, బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466