ఆంధ్రప్రదేశ్
4 న నంద్యాలకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాలలో జరిగే పలు కార్యక్రమాల్లో హాజరుకానున్న ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్.
ఈనెల 4వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ వస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ ప్రకటన ద్వారా తెలిపారు.
బుధవారం నంద్యాల జిపిఎస్ కార్యాలయం నుండి ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ
గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై ఎస్టీ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ వస్తున్నట్లు తెలిపారని అన్నారు. ఉదయం నంద్యాల రోడ్ల భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకొని ఉదయం గిరిజన సంఘాల నేతలతో సమావేశం అవుతారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్ లో ప్రిన్సిపాల్ కృష్ణ నాయక్ కుమారుడి వివాహానికి హాజరై, అనంతరం గిరిజన ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకునేందుకు వినతి పత్రాలను స్వీకరిస్తారు. తదుపరి నంద్యాల జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి జిల్లా కలెక్టర్, ఎస్పీ లను కలిసి సమస్యల గురించి చర్చిస్తారు. అనంతరం శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయానికి చేరుకొని స్వామి, అమ్మవారిని దర్శించుకుంటారు. నాలుగో తేదీన ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ నంద్యాల జిల్లాలో అందుబాటులో ఉంటారని వారి సమస్యలు ఏదైనా ఉన్న తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా నంద్యాల జిల్లా గిరిజన ప్రజానీకానికి జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మీడియా ప్రకటన ద్వారా తెలిపారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక