ఆంధ్రప్రదేశ్
కొత్త అందాలతో కళకళలాడుతున్న నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అభివృద్ధిలో భాగంగా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం దశ తిరిగింది.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఎన్నో ఏళ్లుగా సబ్ రిజిస్టర్ కార్యాలయం అభివృద్ధికి నోచుకో లేకుండా పోయింది. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా ప్రతిరోజు లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయం అందిస్తున్న నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం అభివృద్ధికి నోచుకో లేకుండా బూత్ బంగ్లాల కనిపిస్తున్నప్పటికీ వచ్చిన ఏ అధికారికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాకపోవడం బాధాకరమైన విషయం. ఇటీవలి సాధారణ బదిలీల్లో భాగంగా సబ్ రిజిస్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాయబ్ అబ్దుల్ సత్తార్ ప్రభుత్వ కార్యాలయాల్లో వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలకు అనుగుణంగా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం రూపురేఖలను మార్చి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కొత్త అందాలను తీసుకొచ్చేందుకు రాత్రి పగలు పనులు శరవేగంగా కొనసాగించారు. అయితే అబ్దుల్ సత్తార్ రాకను జీర్ణించుకోలేని కొందరు తమ అనుకూలమైన అధికారులు నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తెప్పించుకోవడంలో విఫలము అవ్వడం వల్ల బాధతో సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ పై అసూయతోను అబ్దుల్ సత్తార్ చేసే కార్యక్రమాల పై ఇష్టానుసారంగా రకరకాలుగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షగలిగిన కొందరు దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్న సబ్ రిజిస్టర్ నాయబ్ అబ్దుల్ సత్తార్ పై గతంలో పనిచేసిన అధికారుల అండతో అదే పనిగా దుష్ప్రచారం ప్రారంభించారు. ఎలాగైనా గతంలో పనిచేసిన అధికారులే కొనసాగేందుకు నాయబ్ అబ్దుల్ సత్తార్ ను అడ్డుకునేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారని ఉద్యోగులు చర్చించుకోవడం కనిపించింది. ఎన్ని చేసినా నాయబ్ అబ్దుల్ సత్తార్ రాకను అడ్డుకోలేక పోయారు. ఆఖరి అస్త్రంగా మంత్రిని గత అధికారులు తమ స్వార్థానికి ఉపయోగించుకున్నట్లు సమాచారం అయినా ఫలించకపోవడంతో సబ్ రిజిస్టర్ అధికారి తన అనుయాయులతో సత్తార్ కు అవినీతి మరకలు అంటిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనలు సృష్టించారు. ఇన్ని చేసినా సత్తార్ రాకను అడ్డుకోలేక పోయారు. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నాయబ్ అబ్దుల్ సత్తార్ పదవి బాధ్యతలు చేపట్టి వచ్చి రావడంతోనే కార్యాలయాన్ని దాతల సహకారంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది రుచించని
కొంతమంది సత్తార్ ను వ్యతిరేకిస్తు సత్తార్ పై అసత్య ఆరోపణలతో అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నించారు.తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఒక అధికారిపై అభియోగాలు చేయడం మంచిది కాదని ఉద్యోగులే మాట్లాడుకోవడం కొసమెరుపు. ఇవేవీ పట్టించుకోని నంద్యాల సబ్ రిజిస్ట్రర్ సత్తార్ కార్యాలయాన్ని జిల్లాకు తగ్గట్టుగా కొత్త హంగులతో తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఎవరూ చేయని విధంగా సత్తార్ సబ్ రిజిస్టర్ కార్యాలయం రూపురేఖలను మారుస్తూ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపురేఖలను మార్చివేశారు. కార్యాలయం పనులు వేగవంతం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత అధికారుల ప్రమేయంతో ఆరోపణలు చేయడంతో ఇవేవీ పట్టించుకోకుండా కార్యాలయం అభివృద్ధికి కృషి చేయడం సబ్ రిజిస్ట్రార్ సత్తార్ ను ప్రజలు ప్రశంసించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టకేలకు త్వరలోనే కొత్త అందాలతో సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమవుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారులు సబ్ రిజిస్టర్ సత్తార్ పై లేనిపోని అబాండాలు వేసిన సబ్ రిజిస్టర్ సత్తార్ తగ్గేదే లేదు అంటూ ముందుకు సాగిపోయారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక