ఆంధ్రప్రదేశ్
వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత.
ఏపీ టుడే న్యూస్,
నంద్యాల జిల్లా రుద్రవరం:
వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు రాణెమ్మ , పీఎం ఖాన్ అన్నారు. గురువారం70 వ వన్య ప్రాణి వారోత్సవాల సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగ ర్ అనురాగ్ మీనా, ఐఎఫ్ఎస్,ఆదేశాల మేరకు, సబ్ డి ఎఫ్ ఓ శ్రీనివాస్ రెడ్డి , సూచనలమేరకు రేంజ్ ఆఫీసర్ బి. శ్రీపతి నాయుడు పర్యవేక్షణ లో తువ్వపల్లి గ్రామం లోని అంగన్వాడీ లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా వన్య ప్రాణుల వేట వంటి నేర ప్రవృత్తులు విడనాడి వన్య ప్రాణుల సంరక్షణ లో భాగస్వాములు అవ్వాలని ,అటవీ ప్రాంతంలో రోడ్డుపై ఆహార పదార్థాలను అడవి జంతువులకు వేయవద్దు అని, వాహన వేగాన్ని తగ్గించి రోడ్డు ప్రమాదాల ను నివారించాలని, రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దు వెంబడి వన్య ప్రాణుల అవసరాలను గుర్తించి మానవ కార్యకలాపాలను తగ్గించి అడవి జంతువులు మానవుల యొక్క సంఘర్షణను తగ్గించాలని, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ సురేంద్ర గౌడు, డి ఈ ఓ శంకర్, డిపోమేస్రి నరసింహ మరియు అంగన్వాడీ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87488