ఆంధ్రప్రదేశ్
100% అంగవైకల్యం కానీ పింఛన్ రావట్లేదు….. యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చి మరిచిన నారా లోకేష్….

ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం(కోసిగి) రిపోర్టర్:
100% అంగవైకల్యం కలిగిన 13 ఏళ్ల బాలుడికి పింఛన్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలో నివాసం ఉండేటువంటి కుమ్మరి మల్లికార్జున తల్లిదండ్రులు కుమ్మరి కోసిగయ్య ,శారదమ్మ దంపతులు అంటున్నారు. సదరన్ సర్టిఫికెట్ కోసం సదరన్ క్యాంపుకు వెళ్లడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెళ్లిన ప్రతిసారి అప్పటికే స్లాబ్ బుకింగ్ చేసినట్లు లేకపోతే ఆధార్ కార్డు నెంబర్ కొడితే నాట్ ఫౌండ్ లాంటి రిజల్ట్స్ రావడం కారణంగా ఫ్లాట్ బుకింగ్ చేసుకోలేక సదరన్ క్యాంపుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కోసిగి వచ్చినప్పుడు పిల్లోడి పరిస్థితి తెలియజేశామని సదరన్ వెబ్సైట్ సాంకేతిక లోపం కారణంగా సదరన్ క్యాంపుకు వెళ్లలేక పింఛన్కు అప్లై చేసుకోలేకపోతున్నామని కూడా మా గోడు వినిపించామని దానికి స్పందించిన నారా లోకేష్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలు జిల్లాలో వికలాంగుల పింఛన్ల కు సంబంధించి మొట్టమొదటగా మీ పిల్లాడికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా లోకేష్ స్పందించి పింఛన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము కుమ్మరి మల్లికార్జున తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక