ఆంధ్రప్రదేశ్
జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా (వీడియో)
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అలంపూర్ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆదివారం కలెక్టర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని,స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. తొలుత బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు.. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్, వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం తో తీర్థప్రసాదాలు, స్వామి, అమ్మ వార్ల చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీని పాటిస్తూ జిల్లా కలెక్టర్ గా జోగుళాంబా సమేత శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు. అలంపూర్ తన అమ్మమ్మ గారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపేవాళ్ళం అని కలెక్టర్ అలంపూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టర్ వెంట ఆలయ ఛైర్మన్ కొంకల నాగేశ్వర రెడ్డి, కర్నూలు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ బి.సుధాకర్ రెడ్డి, అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవో పురేంద్రకుమార్ ఉన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87490