ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం.. (video)
ఏపీ టుడే న్యూస్,
చిత్తూరు జిల్లా, కుప్పం…
ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం కుప్పం నియోజకవర్గ పరిధిలో పది మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎక్సైజ్ సీఐ నాగరాజా మీడియా సమావేశంలో తెలిపారు. ఆదివారం నాడు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కుప్పం మునిసిపాలిటీ పరిధిలో 5, గుడుపల్లి మండలంలో 1, శాంతిపురం మండలంలో 2, రామకుప్పం మండలంలో 2 షాపులకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. భారతీయ పౌరులు అందరూ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వారా ఈనెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపున దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక వ్యక్తి అపరిమితంగా దరఖాస్తులు సమర్పించవచ్చని, ఇందుకోసం 2 లక్షల రూపాయలు ధరావతు చెల్లించాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎస్సై మోహన్ బాబు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482