ఆంధ్రప్రదేశ్
ఆమె పేరు చెప్తే అధికారులు తలలు పట్టుకోవాల్సిందే.

ఆమె పేరు చెప్తే అధికారులు తలలు పట్టుకోవాల్సిందే.
ఏపీ టుడే న్యూస్, మంత్రాలయం
ఇందిరమ్మ ఈ పేరు పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు కొత్తేమీ కాదు, ఆమె పేరు చెప్తే అధికారులు తలలు పట్టుకోవాల్సిందే ,ముందుగా ఒక గ్రామంలో పర్యటించడం అమాయకుడిని గుర్తించడం అతనితో బాగా చదువు పెంచుకొని సమయం చూసి నన్ను బలత్కారం చేశాడని, గ్రామంలో హల్చల్ చేసి, పంచాయతీ పెట్టడం, పంచాయతీలో తను డిమాండ్ చేసినంత డబ్బులు బాధితుడు ఇవ్వకపోతే అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరియు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ లు చేయడం, అయినా తగ్గకపోతే వారిపై అనవసరంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసి కేసు పెట్టించి, కోర్టుకు లాగడం, స్థానికంగా వాళ్ళ పరువు కూడా తీసి వారిని ఊర్లోనే లేనట్లు చేయడం ఇది ఇందిరమ్మ హిస్టరీ.
వివరాల్లోకెళ్తే…. ఆదోని మండలం మాంత్రిక గ్రామానికి చెందిన బోయ ఇందిరమ్మ పై తెలిపిన విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కారణంగా ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు.అందులో భాగంగానే గతంలో కంపాడు గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి గా పనిచేస్తున్న నరసింహులు అనే వ్యక్తిపై ఈ విధంగా ఆరోపణలు చేసి అతడు చివరికి గ్రామంలో తలెత్తుకోలేక గ్రామం నుండి దూరంగా వెళ్లి జీవిస్తున్నటువంటి పరిస్థితి. అదే రకమైనటువంటి రీతిలో మంత్రాలయం గ్రామంలో నివాసం ఉండేటువంటి వీరేష్ (22) ప్రైవేట్ సెక్యూరిటీ గా పనిచేస్తున్న వ్యక్తి పై కూడా అదే రీతిలో వీరేష్ తో ఇందిరమ్మ(45)చనువు పెంచుకొని, చివరికి అతనిపై కూడా అనవసరమైన కంప్లైంట్స్ స్థానిక పోలీస్ స్టేషన్ నందు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు ఇవ్వడం జరిగింది. దాంతో వీరేష్ పని చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కాస్త ఊడిపోవడంతో ఆర్థికంగాను ,సామాజికంగాను క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంతటితో ఊరుకోకుండా వీరేష్ ఇంటి దగ్గరికి వెళ్లి పలుమార్లు వాగ్వాదానికి దిగడంతో , పొరుగువారు కూడా ఎంత నచ్చ చెప్పినప్పటికీ వినకపోవడం తో వీరేష్ భార్య సావిత్రి ఆమెపై సోమవారం కర్నూలు కలెక్టరేట్ స్పందనలో కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటి వారి వల్ల అమాయకులు బలవుతున్నారని ,కాపురాలలో అనవసరమైన అపోహాలు తీసుకొచ్చి భార్య భర్తల మధ్య గొడవలకు కారణం అవుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని కలెక్టర్ ను కోరింది.స్థానిక మంత్రాలయం పోలీస్ స్టేషన్లోనే ఆమె పై విచారణ చేసిన క్రమంలో వాళ్ల కుటుంబీకులు సైతం వచ్చి ఆమె మతిస్థిమితం సరిగా లేదని ఆమెతో మాకు ఎటువంటి సంబంధం లేదని లిఖితపూర్వకంగా కూడా రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని, ఆమె మానసిక స్థితిని తెలుసుకొని అవసరమైతే ఆమెకు మానసిక ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఆమె చేసిన నిర్వాకం కారణంగా నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి సైతం వెళ్లినట్లు ఆవేదన వ్యక్తం చేస్తుంది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక