ఆంధ్రప్రదేశ్
రైతులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం
రైతులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం..
ఏపీ టుడే న్యూస్,పత్తికొండ/ఆలూరు:
రైతులకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది అని రబి సీజన్లో నల్లరేగడి పొలాల్లో పప్పు శనగ విత్తనాలు వేసుకునే రైతులకు రాయితీపై అందిస్తున్న శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆలూరు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ అన్నారు. దేవనకొండలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు ఆధ్వర్యంలో పప్పు శనగ విత్తనాలను, తార్పాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ డిఏ కూటమి ప్రభుత్వము రైతుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. త్వరలో ప్రభుత్వము వ్యవసాయ పరికరాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. 100 కేజీల అసలు ధర 9,400 ఉండగా రాయితీ పోను రైతు 7050చెల్లించాలన్నారు. పప్పు శనగ విత్తనాలు కావలసిన రైతులు రైతు సేవ కేంద్రాలలో సంప్రదించాలన్నారు, ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర వనవాసి శాస్త్రవేత్త రాఘవేంద్ర,పత్తికొండ ఏ డి ఏ విజయమోహన్ ఆలూరు బిజెపి ఇంచార్జి వెంకటరాముడు, టిడిపి మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, టిడిపి నాయకులు బడి గింజల రంగన్న, ఆకుల వీరేషు, మాలిక్, ఈదుల దేవర బండ సుభాన్, కప్పట్రాళ్ల మల్లికార్జున, వెంకటస్వామిగౌడ్, మల్లికార్జున గౌడ్, రాజా సాబ్, వెలమకూరు సర్పంచ్ భాస్కర్, వ్యవసాయ శాఖ సిబ్బంది రంగన్న, మల్లికార్జున, జయరాం పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67976