ఆంధ్రప్రదేశ్
శానిటేషన్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన ఎన్ఎండి ఫయాజ్ , ఖండే శ్యామ్ సుందర్ లాల్

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల టౌన్ 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ నందు 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో 12వ వార్డు సచివాలయంలో ఉన్న శానిటేషన్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని దసరా పండుగ సందర్భంగా శానిటేషన్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ దసరా పండుగ అనేది హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒక పెద్ద పండుగని ఈ పండుగను ప్రజలందరూ కలిసికట్టుగా చేసుకుంటారని ఈ దసరా రోజుల్లో అమ్మవారి బొమ్మలను వాడవాడల నెలకొల్పి పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని ఆయన అన్నారు. ఇలాంటి మంచి పండుగ రోజు 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని శానిటేషన్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేయడం చాలా మంచి పరిణామమని తెలిపారు. అందరూ నూతన దుస్తులను ధరించి ఆహ్లాదకర వాతావరణంలో దసరా పండుగను జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్త , కండె ఆనంద్ , చింతల కుమార్, గెలివి శేఖర్,చలంబాబు , మలిపెద్ది నాగరాజు, జనార్ధన్, జయకర్, అమృత్, ఇసుక చాంద్ , చంద్రమౌళి, దస్తగిరి ,శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక