ఆంధ్రప్రదేశ్
పుచ్చకాయలమాడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వంద రోజుల లక్ష్యాల సాధనతో పాటు పుచ్చకాయలమాడ గ్రామంలో ముఖ్యమంత్రి హామీల సాధన పై కూడా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ కు సంబంధించి 203 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..అలాగే 40 మందికి ఇళ్ళ స్థలాల మంజూరుకు కూడా భూమిని గుర్తించాలని కలెక్టర్ డిఆర్ఓను అదేశించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు సంబంధించి 48 దరఖాస్తులు వచ్చాయని, వీటిని మంజూరు చేసేందుకు సెర్ప్ సిఈఓకు పంపాలని కలెక్టర్ డిఆర్డిఎ పిడిని ఆదేశించారు.. నూతన రేషన్ కార్డులకు సంబంధించి 15, రైస్ కార్డు విభజన కోసం 3 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పౌరసరఫరాల శాఖ కమీషనర్ కు పంపాలని కలెక్టర్ డిఎస్ఓ ను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ క్రింద కుళాయి కనెక్షన్ లకు, టాయిలెట్స్ కోసం 105 దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.. అలాగే డ్రెయిన్స్ , వీధి దీపాలు, సిసి రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్, కమ్యూనిటీ హాల్, మినీ గోకులం, ఉన్నత పాఠశాలకు కాంపౌండ్ వాల్, ఫామ్ పాండ్స్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగిందన్నారు.. దర్గాకు కాంపౌండ్ వాల్, స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్, తాగునీటి పైప్ లైన్, వెటర్నరీ లైవ్ స్టాక్ బిల్డింగ్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని కలెక్టర్ వివరించారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక