ఆంధ్రప్రదేశ్
సరస్వతీ దేవి గా దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు.
ఏపీ టుడే న్యూస్ :- ఉల్లి గుర్రప్ప రిపోర్టర్స్ – సిరివెళ్ళ- నంద్యాల జిల్లా –
*శిరివెళ్ల :-* మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిశాల దేవస్థానంలో బుధవారం సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.
శిరివెళ్ల కు చెందినటువంటి బి సంజీవ కొండయ్య సులోచన దంపతులు సరస్వతి దేవికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదములు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం శుభ సమయాన, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శరన్నవరాత్ర ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారం అలంకరించడం జరుగుతుందని తెలిపారు .
మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారు.
భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి కి పూజలు నిర్వహిస్తే అమ్మవారి కరుణ కటాక్షములు సిద్ధిస్తాయని తెలిపారు.
చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో వాసవాంబ దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన సరస్వతి దేవిని కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధి వికాసము కలుగుతుందని అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477