ఆంధ్రప్రదేశ్
ఆదినారాయణ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రామ సుబ్బారెడ్డికి లేదు టిడిపి ఇన్చార్జి చదిపిరాల్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి

కడప జిల్లా,
జమ్మలమడుగు;
నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చదిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేసే వ్యక్తిని విమర్శిస్తే కోపం రాదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గతంలో మిమ్మల్ని విమర్శించినప్పుడు ఈ విమర్శ అప్పుడు ఎందుకు లేదని ప్రశ్నించారు. జమ్మలమడుగు ఎర్రగుంట్లలో అన్న క్యాంటీన్లో ఏర్పాటు కనబడడం లేదా, నియోజకవర్గానికి మొదటి దశలో 16 కోట్లు అభివృద్ధి పనులు తెచ్చినవి కనబడడం లేవా అని ప్రశ్నించారు. గత మూడు నెలల్లో మూడుసార్లు ఉచిత వైద్య శిబిరాన్ని, జాబ్ మేళా నిర్వహించి నియోజక వర్గానికి అన్ని విధాల అండగా ఉన్నామని తెలిపారు. ఆలోచన చేసి విమర్శ చేయాలి కానీ జగన్ ఆదేశించారని విమర్శిస్తే ఇలాగే ఉంటుందని తెలిపారు. కార్యకర్తల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మా దేవగుడి కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం లేనప్పుడు ఒకలా మాట్లాడం మీకే చెల్లుబాటు అవుతుంది తప్ప మా కుటుంబానికి కాదన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో గత ఐదేళ్లలో అభివృద్ధి ఎలా గుర్తు పడిందో మీకు తెలియదా అని ప్రశ్నించారు. వైద్యం, విద్య బాగుంటే నియోజవర్గం బాగుంటుందని నమ్మిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. బాధ్యతతో పనిచేసే ఎమ్మెల్యేను మాట్లాడం సరికాదన్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిర్మాణాత్మకంగా విమర్శించాలి గాని ఇష్టానుసారంగా విమర్శించడం తగదన్నారు. చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసి ఐదు నియోజకవర్గాల్లో అవినాష్ రెడ్డిని ఓడించిన విషయం మీకు తెలియదా అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, దేవగుడి యూత్ నాగేశ్వర్ రెడ్డి, గోన పురుషోత్తం రెడ్డి, పోన్న తోట శ్రీను, జయ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక