ఆంధ్రప్రదేశ్
గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు
ఏపీ టుడే న్యూస్ పాణ్యం రిపోర్టర్ అక్టోబర్ 20 :

పాణ్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం వేకువజామునే గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు,రౌడీషీటర్లు,బెల్టు షాపులు మరియు ఇతర రాష్ట్రాల మద్యం,నాటు సారా, రికార్డులు లేని వాహనాలను,గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో మరియు పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. అనంతరం ఆ గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు.ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు.మట్కా, పేకాట,తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136752