ఆంధ్రప్రదేశ్
వాటాల బేరం కుదరకనే వైన్ షాప్ మూత

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 20.
మహానంది మండలంలోని రెండిటిలో వాటాల బేరం కుదిరిన మరో వైన్ షాప్ లో వాటాల బేరం కుదరకపోవడంతో శనివారం రాత్రి తెరిచి ఆదివారంమూతవేయడంచర్చనీయాంశంగా మారింది. శనివారం రాత్రి ప్రారంభించి కూడా మద్యాన్ని బెల్ట్ షాపు నిర్వాహకులకు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పై 20 రూపాయలు అదనంగా తీసుకుని బెల్ట్ షాపుల ద్వారా విక్రయించుకోవడానికి క్రయ విక్రయాలు సాగించినట్లు తెలుస్తుంది. బెల్ట్ షాపు నిర్వాహకులు గ్రామాల్లో అదనంగా మందు బాబుల నుంచి 60నుంచి 70 రూపాయల వరకు అదనంగా వసూలు చేసి విక్రయాలు సాధిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటికీ కారణం స్థానికంగా ఉన్న కొందరికి వాటాల రూపంలో దాదాపు 30% అదనంగా చెల్లించాల్సి వస్తుందని అందుకే ఈ విధంగా చేయాల్సి ఉందని నిర్మొహమాటంగా బెల్టు షాపు నిర్వాహకులకు మొహమాటం లేకుండా సమాధానం ఇచ్చి మద్యాన్ని అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మద్యం దుకాణం కొన్ని గంటలపాటు విక్రయించి అనంతరం మూసివేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంతోపాటు కొందరు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో వారి యొక్క పదవులు అనుకున్న ప్రాంతంలో దక్కించుకోవడంతో చేతులు ముడుచుకొని మీనమేషాలు వేస్తూ కల్లప్పగిస్తూ చూస్తూ ఉండి పోయారే తప్ప ఎందుకు షాపులు తెరవడం లేదు, ప్రారంభించిన ఇతర మద్యం షాపుల నుండి మండలంలోని వివిధ గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మరియు పక్క మండలంలోని గ్రామాలకు సిండికేట్ ఐ తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభంలోనే ఇలా ఉంటే మునుముందు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఇంతింతై వట్టుడింతై అన్న చందనంగా పుట్టగొడుగుల్లా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు సమాచారం.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక