ఆంధ్రప్రదేశ్
కప్పట్రాళ్ల గ్రామ పరిధిలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యురేనియం తవ్వకాలు నిలిపివేయాలి డీవీఎంసీ సభ్యులు కాకర్ల శాంతికుమార్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూల్ జిల్లా అటవీశాఖ(DFO) శ్యామల మేడంని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ పరిధిలో యురేనియం తవ్వకాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ యురేనియం తవ్వకాల నోటిఫికేషన్ విడుదల చేసింది దీన్ని ద్వారా గ్రామాల్లో ప్రజలు భయందోళనకు గురువుతున్నారు. ముఖ్యంగా ఈ మండలలో హంద్రీ నీవా రైట్ కెనాల్ ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇప్పుడిప్పుడే ఈ మండలంలో రైతులు ప్రజలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. గతంలో ఫాక్షన్ పేరుతో ఈ మండలం కప్పట్రాళ్ల గ్రామం రక్తపుటేరులు ప్రవహించిన పోరుడుగడ్డ ప్రస్తుతం హంద్రీ నీవా ద్వారా చాలా మార్పులు వచ్చాయి వ్యవసాయమే ఆధారంగా జీవితం ప్రశాంతంగా గడుపుతున్నారు.
యురేనియం తవ్వకాల ద్వారా వారి జీవనశాలి ఛిన్నాభిన్నం అయి మండలం వ్యాప్తంగా కాలుష్యం ఏర్పడి 400 ఎకరాల రిజర్వు ఫారెస్ట్, వ్యవసాయం మరియు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించి యురేనియం తవ్వకాల పై చేస్తున పరిశోధనలు నిలిపివేయాలి అని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్లె పల్లి రంగుడు,సంపత్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87277