ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి వదిలే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి వదిలే ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలి
ఏపీ టుడే న్యూస్: కర్నూలు
జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లాలో ని ప్రైవేట్ ఆవరణంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ నందవరం మండల అధ్యక్షులు శావల బుజ్జిబాబు మాదిగ మాట్లాడుతూ, ఆగస్టు 1వ తేదీన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షనీయం.ఈ తీర్పు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341,342 , 16(4) రాజ్యాంగ జనాభా ధమాషా ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే వర్గీకరణ ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటినుండి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లు వదిలిన వాటికి, రేపు జరగబోయే DSCఉద్యోగా లకు , గ్రామ, మండల,పురపాలకలల్లో రాజకీయ పదవులుకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అమలు చేయాలి. ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లు అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రవేట్ స్కూల్లో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు ఎస్సీ ఎస్టీ కులాలకు 25% సీట్లు ఉచితంగా అమలుపరచని పాఠశాలలపై చర్యలు తీసుకొని, సీజ్ అయ్యేంతవరకు పోరాటం చేస్తామని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీలో స్థానికులకు 80% ఉద్యోగాలు సక్రమంగా అమలుపరచాలి,,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పటిష్టంగా అమలు కావాలి అని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్, జై భీమ్ ఎమ్మార్పీఎస్ నందవరం మండల అధ్యక్షులు శావల బుజ్జిబాబు,జై భీమ్ ఎమ్మార్పీఎస్ నందవరం మండలం ఇన్చార్జి చింపిరి చిన్న పోతప్ప,జై భీమ్ ఎంఆర్పిఎస్ నందవరం మండల ప్రధాన కార్యదర్శి శావల శాంతిరాజు, జై భీమ్ ఎమ్మార్పీఎస్ నందవరం మండల కన్వీనర్ శావల సత్యానందం, జై భీమ్ ఎంఆర్పిఎస్ నందవరం మండల నాయకుడు పరంపోగు సురేష్, జై భీమ్ ఎమ్మార్పీఎస్ పెద్ద కడుబూరు మండలం ఇన్చార్జి రవి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460