ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో జాంబవంతుని మొదటి విగ్రహ ప్రతిష్ట

ఏపీ టుడే న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు నవంబర్ 22
జమ్మలమడుగు నియోజకవర్గంలోని ధర్మాపురం గ్రామం వద్ద ఉన్న శివుని ఆలయం ప్రాంగణంలో మూడు అడుగుల జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. జాంబవంతుడు బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూక రాజు అని కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉందని క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు అని వాల్మీకి రామాయణంలో జాంబవంతుని గురించి రచించారని విగ్రహ దాత కె.పి హరి రాయల్ తెలిపారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో మొదటి జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జమ్మలమడుగు నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. కేపీ హరీంద్ర సొంత నిధులతో సుమారు రెండు లక్షల రూపాయలతో జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ జరిగిందని గత మూడు రోజులుగా హోమాలు, అభిషేకాలు జరిగాయని అర్చకులు భరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈరోజు శుక్రవారం కలిశస్థాపన మహా పూర్ణాహుతి జాంబవంతుని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగిందని అలాగే అన్న ప్రసాదాలు నిర్వహించామని అర్చకులు భరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి శివాలయం ధర్మకర్తలు, ధర్మాపురం గ్రామ ప్రజలు, జమ్మలమడుగు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87413