ఆంధ్రప్రదేశ్
చిందేపల్లి కి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ?

*చిందేపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించండి – వినుత కోటా గారిని కలిసిన చిందేపల్లి గ్రామస్థులు, మహిళలు.*
శ్రీకాళహస్తి మండలం, చిందేపల్లి గ్రామస్థులు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారిని కలిసి వారి గ్రామంకి వెళ్ళే రోడ్డు సమస్యను పరిష్కరించమని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్లి వారి గ్రామానికి వెళ్ళే రోడ్డు పునఃప్రారంభం చెయ్యాలని కోరడం జరిగింది.*
*ఈసీయల్ ఫ్యాక్టరీ వారు గత సంవత్సరం చిందేపల్లి రోడ్డు ను అక్రమంగా ఆక్రమించుకుని 75 సం.|| గా గ్రామానికి వెళ్తున్న రోడ్డును మూసి వేయించారు. రోడ్డు సమస్య కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా ఆమరణ నిరాహారదీక్ష చేసి పోరాడిన జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారి పైన, వారి కుటుంబ సభ్యుల పైన గ్రామస్తుల పైన కేసులు పెట్టి , వినుత గారి భర్త కోటా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకి కూడా పంపారు.* గత ప్రభుత్వంలో అధికారులు, అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యం తో కుమ్మక్కై గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.
తప్పకుండా చిందేపల్లి గ్రామ రోడ్డు సమస్యను తమ సొంత సమస్యగా భావించి త్వరిత గతిన పరిష్కారం అయ్యేలా చేస్తామని ప్రజలకి వినుత గారు హామీ ఇచ్చారు. ఈ సమస్య కోసం పోరాడినందుకు గత సం.|| జూన్ 16 న తన భర్త కోటా చంద్ర బాబు గారిని అరెస్టు చేసి జైలుకు పంపారని, ఇప్పటికీ తన తల్లి తో పాటు, గ్రామస్థులు ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెడుతున్నారని ప్రజలకి గుర్తు చేశారు. అక్రమంగా ప్రజల రోడ్డు ను మూసి వేసిన ఈసీయల్ ఫ్యాక్టరీ యాజమాన్యం పై , ఉదంతం వెనక ఉన్న అధికారుల పై చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు.
*తమ గ్రామం కోసం ప్రాణాలకు సైతం లెక్క చెయ్యకుండా పోరాడిన విషయం ఎప్పటికీ గ్రామస్థులు ఋణపడి ఉంటామని, రాక్షస ప్రభుత్వం పోయి, ప్రజా ప్రభుత్వం వచ్చినందుకు గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.*
*గతంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన మేరకు చిందేపల్లికి ఉప ముఖ్యమంత్రి ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ. పవన్ కళ్యాణ్ గారు వచ్చేలా చేసి అక్రమంగా మూసి వేసిన రోడ్డు మళ్లీ తెరిపించేలా ఖచ్చితంగా చేస్తామని , మొదటి సమస్యగా చిందేపల్లి రోడ్డు సమస్యను తీసుకుని పరిష్కరిస్తామని గ్రామస్థులకు వినుత కోటా గారు హామీ ఇచ్చారు.*
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక