ఆంధ్రప్రదేశ్
పులి రామచంద్రయ్య ఆగడాలు అరికట్టండి
*గుడి సంరక్షణ వదిలి రౌడీయిజం*
*చాముండేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు*
ఏపీ టుడే న్యూస్ తిరుపతి జిల్లా/శ్రీకాళహస్తి డిసెంబర్ 19

శ్రీకాళహస్తి టౌన్ బ్యాంకు మాజీ వైస్ ఛైర్మన్ పులి రామచంద్రయ్య ఆగడాలు అరికట్టాలని చాముండేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు కోరారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు.శ్రీకాళహస్తి పట్టణం భాస్కరపేటలో వెలసిన చాముండేశ్వరిదేవి ఆలయ నిధులు పులి రామచంద్రయ్య దుర్వినియోగం చేశారని కమిటీ సభ్యులు ఆరోపించారు. గతంలో ఆలయ చైర్మన్ గా ఉండిన పులి రామచంద్రయ్య 13 ఏళ్లుగా నష్టాలు చూపిస్తూ ఆదాయాన్ని మొత్తం దోపిడీ చేశారన్నారు. ఇదేమని అడిగితే దౌర్జన్యాలకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు అతని ఆగడాలు శృతిమించుతున్నాయన్నారు. ప్రశ్నించిన వారిపై పులి రామచంద్రయ్య దాడులు చేస్తున్నారన్నారు. అతని నుంచి ఆలయాన్ని సంరక్షించడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరారు. పాత కమిటీని సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రద్దు చేసినట్లు వారు తెలిపారు. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. కొత్త కమిటీ నష్టాలు లేకుండా పది నెలల్లోనే మూడు లక్షలకుపైగా ఆదాయాన్ని తీసుకు వచ్చిందన్నారు. పది నెలల్లోనే ఈ ఆదాయం వస్తే 13 ఏళ్లలో ఎంత ఆదాయం వచ్చి ఉంటుందో తెలుస్తోందన్నారు. పులి రామచంద్రయ్య ఆలయ ఆదాయాన్ని తన సొంతానికి ఉపయోగించుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కొత్త కమిటీ ఏర్పడినా ఇప్పటికీ తానే చైర్మన్ అంటూ దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనికి తోడు లాయర్ నోటీసులు ఇస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఆలయ సంరక్షణను పూర్తిగా వదిలేసిన పులి రామచంద్రయ్య రౌడీయిజం చేస్తూ ఆలయ ప్రతిష్టతను దిగాజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆలయం తన స్వార్జితమంటూ కోర్టుకు వెళ్లగా కేసు కొట్టివేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు పైకోర్టులో అపీలు కూడా చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ఆలయ నిధులు దుర్వినియోగం చేసి… ఇప్పుడేమో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అతని రౌడీయిజం, ఆగడాల నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఆలయ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చాముండేశ్వరిదేవి ఆలయ కమిటీ కమిటీ చైర్మన్ సి.జయరామయ్య, సభ్యులు రాధాకృష్ణయ్య, జగధీశ్వరయ్య, యుగంధర్, సుధాకర్, వీరయ్య, శేఖర్, భద్రి, చిన్న గురునాధం, రామయ్య, శేషయ్య, మల్లిఖార్జున్, ఈశ్వరయ్య, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68101