ఆంధ్రప్రదేశ్
జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభకు గ్రామ గ్రామం నుంచి హిందువులు కదలిరావాలి :- బిజెపి నాయకులు విజయ్ కుమార్ చారి
ప్రకాశం జిల్లా కనిగిరి ఏపీ టుడే న్యూస్ జనవరి 3
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయ పెత్తందాల నుంచి విముక్తి పొందేందుకు, స్వయం ప్రతిపత్తి సాధన కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జనవరి 5, 2025న విజయవాడ, కృష్ణాజిల్లా ,గన్నవరం మండలం, కేసరపల్లె వద్ద,హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుందనీ శుక్రవారం కనిగిరి నియోజకవర్గ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ పెరమన విజయ్ కుమార్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ దేవాలయాల్లో రాజకీయ జోక్యాలు మితిమీరిపోతున్నాయని, హిందూ సమాజానికి దేవాలయాలను స్వయంగా నిర్వహించగల సామర్థ్యం ఉందని తెలిపారు. దేవాలయాలు రాజకీయ నిరుద్యోగుల కోసం కాక, హిందూ ధర్మ పరిరక్షణకు నిలయాలుగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో దేవాలయాల రక్షణ ఇబ్బందికరంగా మారిందని, హిందువుల అనైక్యత, ఉదాసీనత వల్ల కొందరు ఇతర మతాల వ్యక్తులు హిందుత్వం పై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలపై ప్రభుత్వ ఆధిపత్యం వల్ల, అలాగే ఆలయాల్లో ఇతర మతాలకు చెందిన వ్యక్తులు పనిచేయడం వల్ల ఆలయాల గౌరవానికి నష్టం కలుగుతోందని తెలిపారు. లక్షలాది హిందువులు ఈ హైందవ శంఖారావం సభకు తరలి వచ్చి, హిందూ ధర్మ పరిరక్షణకు మద్దతు తెలపాలని ఆయన పిలుపునీచ్చారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87463