ఆంధ్రప్రదేశ్
పవిత్ర మక్కా యాత్ర చేయడం ఎంతో అదృష్టం .. -జామియామసీదుపీఠాధిపతికి ఘనంగా సన్మానం
కడప జిల్లా/జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ జనవరి 3:
ముస్లింలు జీవితంలో ఒక్కసారి అయినా పవిత్ర మక్కా యాత్ర చేయడం ఎంతో అదృష్టమని ఈ యాత్రలో ఎంతో పవిత్రంగా ఉండి అల్లాహ్ ను స్మరించుకుంటూ ఉమ్రా యాత్ర ( పవిత్ర మక్కా యాత్ర ) నిర్వహించాలని జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం జామియా మసీదులో జుమ్మా నమాజు అనంతరం జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ముస్లిం సోదరులు పీఠాధిపతి మక్కా యాత్రకు వెళుతున్న సందర్భంగా ఆయనను కాశ్మీరు శాలువాలు, పూల దండలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ ఈ పవిత్ర మక్కా యాత్ర జీవితంలో ఒక్కసారి అయినా ముస్లింలు చేయాలని తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మక్కా యాత్రలో వెళ్లేవారు అల్లాహ్ ను స్మరించుకుంటూ వెళ్లాలని జీవితంలో తాము చేసిన పాపాలు క్షమించాలని అల్లాహ్ ను వేడుకోవాలని సూచించారు. అనంతరం మక్కాయాత్ర చేయడం వల్ల లభించే పుణ్యఫలాల గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జామియా మసీదు అభివృద్ధి కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


ఫోటోరైటప్:03జెయండి01: పీఠాధిపతిని ఘనంగా సన్మానిస్తున్న ముస్లిం సోదరులు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466