Connect with us

Uncategorized

పవిత్ర మాసం రంజాన్

Published

on

ముస్తాబవుతున్న మసీదులు

విశ్వనాథ్
కర్నూలు జిల్లా/హోళగుంద‌. ఏపీ టుడే న్యూస్

ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులలో భక్తిభావం ఉప్పొంగుతుంది. ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారం తదితర నియమాలను ముస్లింలు పాటిస్తారు. మార్చ్ ఒకటి,రెండు తేదీల్లో ప్రారంభం కానున్న రంజాన్ నెలలకు అహలె హదీస్ మసీదులు, ఆహలేశున్నతుల్ జమాత్ మసీద్, తబ్లిక్ మసీద్, రాజా నగర్ లోని మసీదులను ముస్లిం కమిటీ, ముటవల్లీలు అన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తగలనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ నెలలో ఉపవాస దీక్షలతో పాటు ఐదు పూటల నమాజ్, రాత్రి వేళలో ప్రత్యేకంగా చేసే తరారీ నమాజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముతవల్లిలు కొలిమి వాహిద్, ముల్లావలి, ముల్లా షబ్బీర్, శాలి ఫక్రుద్దీన్, డాక్టర్ ఖాసీం, పింజారు సనావుల్లా, ముల్లా అల్లా బకాష్ ఆదివారం తెలిపారు. ప్రార్థన కోసం వచ్చే ముస్లిం సోదరులు, మహిళలు, బాల బాలికలు, కటోర ఉపవాస దీక్షల కోసం మసీదులో త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సదుపాయం కల్పించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండలంలోని అన్ని మసీదులను రంజాన్ నెల సందర్భంగా మసీద్ ముసవల్లీలు అన్ని హంగులతో ముస్తాబు చేశారు. సంబంధిత అధికారులు రంజాన్ నెలలో త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని టిడిపి నాయకులు అబ్దుల్ సుభాన్, డి ఎస్ భాషా, మోయిన్, బడే గర్ అబ్దుల్లా, ముల్లావలి కోరారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580163
Total Users : 47847