ఆంధ్రప్రదేశ్
అక్రిడేషన్ వేగంగా పునరుద్ధరించాలి యుజెఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

అక్రిడేషన్ వేగంగా పునరుద్ధరించాలి
యుజెఎఫ్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
జర్నలిస్టుల అక్రిడేషన్ ను వేగంగా పునరుద్ధరించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యూజేఎఫ్) నాయకులు అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.నాగేంద్రుడు, జి.మునిస్వామి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన అక్రిడిటేషన్ కాలపరిమితి ఈనెల 28 వ తేదీతో గడువు ముగియనుందన్నారు. వెంటనే నూతన అక్రిడిటేషన్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే జర్నలిస్టులు తమ బస్సు చార్జీల రాయితీలను నష్టపోవాల్సి వస్తుంది. వెంటనే అక్రిడి టేషన్లో పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించి మార్చి 1వ తేదీ లోపలనే జర్నలిస్టులు అక్రిడిటేషన్లను పునరుద్ధరించి ఆర్టీసీ చార్జీలో రాయితీకి ఆటంకం రాకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో యుజెఎఫ్ జిల్లా నాయకులు నీలం సత్యనారాయణ, చంద్రమోహన్, విజయ్ కుమార్, మల్లికార్జున,నగర కోశాధికారి రాజశేఖర్, నాయకులు అసిఫ్, వరప్రసాద్, జయరాజు, రవిగౌడ్, కరణ్, ప్రసాద్, శేఖర్, లోకేష్, రవి, ఉరుకుందు, సంజీవయ్య, జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక