ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన

నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన.
నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్.
నంద్యాల జిల్లా లో చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన చికెన్ ను తినడం కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం బర్డ్ ప్లూ ప్రచారాలతో తగ్గిన చికెన్ అమ్మకాలను పెంచుకునేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు మినీ చికెన్ మేళ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు . స్థానిక చికెన్ దుకాణాల యజమానుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా చికెన్, చికెన్ పకోడి, చికెన్ లాలీపాప్ , ఉడకబెట్టిన కోడిగుడ్లును అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చికెన్ మంచి పోషకాహారమని దీనిని తినడం సురక్షితమే అన్నారు. 70 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడిలో చికెన్, గుడ్లు వండడం వలన ఒక వేళ బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందన్నారు. ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని హ్యాపీగా చికెన్ తినొచ్చని తెలిపారు .
ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ , డిసీ మెంబర్ చాబొలు ఇలియాస్ , నంద్యాల మండల టిడిపి ప్రధాన కార్యదర్శి మాండ్ల గుర్రప్ప , రైతునగరం హరిబాబు , చికెన్ షాపులో యజమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక