ఆంధ్రప్రదేశ్
ట్రాక్టర్ బోల్తా పడి 35 మంది గాయాలు
ట్రాక్టర్ బోల్తా పడి 35 మంది గాయాలు పాలైన మహిళలను అందులో ఒకరు అక్కడికక్కడే మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలి. సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం .
నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ రిపోర్టర్ ఏపీ టుడే న్యూస్.
పాణ్యం మండలం తొగర్చిడు గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో చనిపోయిన మహిళను గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో బుధవారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి బాల వెంకట్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డేవిడ్, రత్నమయ్య, జయన్న లతో కలిసి పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన మహిళ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని మరియు తీవ్ర గాయాలతో చేతులు కాళ్లు నడుము విరిగిన మహిళలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సాయంత్రం మూడు గంటల సమయంలో ట్రాక్టర్ బోల్తా పడి సుమారు 35 మంది మహిళలకు గాయాలతో పాటు ఒక మహిళ చనిపోవడం జరిగినది. అందులో 8 మంది మహిళలకు కాళ్లు చేతులు విరగడంతో పాటు వారిలో ఒకరికి నడుము విరిగినదని ఆ కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని పాణ్యం నియోజకవర్గం తొగర్చిడు గ్రామానికి చెందిన మహిళలు ఊరుమార్పురం గ్రామానికి వచ్చి పొగాకు దోరణాలు కుట్టి సాయంకాలం తిరిగి వారి ఇండ్లకు చేరుకోవడానికి ట్రాక్టర్ పైన తొగర్చిడు గ్రామానికి బయలుదేరారు. అయితే రెండు గ్రామాలకు మధ్యలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడడంతో సుమారు మూడు గంటల సమయమున ఘోర ప్రమాదం జరిగినదన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించడం జరిగినదని,మిగతా 32 మంది మహిళలకు తీవ్ర గాయాలతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు చేరారని అందులో చాలామంది పేద కుటుంబాల నుంచి పనిచేసుకొని బ్రతికే వాళ్లే కాబట్టి వారి కుటుంబాలను ఆదుకోకపోతే సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాధ్యతలను కలుపుకొని ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87378