Connect with us

ఆంధ్రప్రదేశ్

ప్రియదర్శినీ బాలవిహార్ లో చిన్నారులలో సృజనాత్మకతను వెలికితీసిన విజ్ఞాన ప్రదర్శన

Published

on

ఏపీ టుడే న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి జైదేవ్ కొత్తపేట (మార్చి 1) ప్రియదర్శినీ బాలవిహార్ లో జరిగిన జాతీయ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో పిల్లలు ఎంతో శ్రద్ధాసక్తులతో పాల్గొన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు ప్రదర్శనాంశాల తయారీలో పిల్లలకు సహకరించారు.

సైన్స్ ఎగ్జిబిషన్లంటే పిల్లలందరికీ బలే ఇష్టంగా ఉంటుంది. పిల్లలు వాళ్ళు ఆకళింపుచేసుకున్న రీతిలో వివిధ అంశాలను తయారుచేసే క్రమంలో స్కేలుతో కొలతలు చూసుకుంటూ, పెన్సిల్ తో గీతలు గీసుకుంటూ అట్టలను, పేపర్లను చాకులతోనూ, కత్తెర్లతోనూ వాళ్ళకు కావలసినట్టు ఎలా మలచుకోవాలో నేర్చుకుంటారు. జిగురుతో వాటిని అతుకుతూ, వాళ్ళకు కావలసిన రూపం వచ్చేవరకు చాలా కృషి చేస్తారు. ఆపై వాటికి రకరకాల రంగులు వేయడం చేస్తారు. సైన్స్ ఎగ్జిబిషన్లు పిల్లలలో వివిధ పని నైపుణ్యాలను పెంచుతాయి. ఇలా ఏటేటా అనేక వస్తువులను తయారు చేసే క్రమంలో పిల్లలు అనేక నైపుణ్యాలను నేర్చుకోవడంతో బాటు శ్రమ విలువ, వస్తువుల విలువ కూడా తెలుసుకుంటూ ఎదుగుతారు. ఏవేవో చేయాలనే వాటిని గురించి అందరికీ చెప్పాలనే ఆలోచన పిల్లలకు చిన్ననాటి నుండి అనిపించేలా ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు చేస్తాయి. పిల్లలలో పలు నైపుణ్యాలకు పునాదులు వేస్తాయి. “ఒక తరం తాను నేర్చుకున్న నిర్మాణ కౌశలాన్ని తన తర్వాతి తరం వారికి అందివ్వండం వల్ల జరిగే ప్రగతే చరిత్ర.” అని ఇ. హెచ్. కార్ అనే ప్రముఖ చరిత్రకారుడు చెప్పినది ఇక్కడ అక్షరాలా అన్వయమౌతుంది.

ఈ సత్యాన్ని నమ్మిన ప్రియదర్శినీ బాలవిహార్ శాస్త్ర సాంకేతిక రంగాల విశిష్టతలు పిల్లలకు చిన్ననాటి నుండి అనుభవపూర్వకంగా అర్థమయ్యేలా తప్పనిసరిగా సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువమంది పిల్లలు పాల్గొనేలా చేస్తుంది.

మానవ శరీరం, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కన్ను, చెవి, నాలుక, జీర్ణ వ్యవస్థ, జీవ వైవిధ్యం, జన్యు నిర్మాణం తదితర అంశాలను తెలిపే నమూనాలు, చిత్రాలు ప్రదర్శించారు. రోడ్డు జల వాయు వాహనాలు, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారాలు, వాక్యూమ్ క్లీనర్ పనిచేసే విధానం, విద్యుత్ సరఫరా విధానం పనిచేసే నమూనాలు ప్రదర్శించారు. భూకంపాలు మరియు అగ్ని పర్వతాలు ఏర్పడే విధానం, న్యూక్లియర్ పవర్ పాయింట్ పనిచేసే విధానము, పిన్ హోల్ కెమేరా పనిచేసే విధానం, మైక్రోస్కోపుల్లోని వివిధరకాలు, గాలిమరల్లో రకాలు, వాయు మరియు జల కాలుష్య నివారణ మార్గాలు తదితర విషయాలెన్నో ఈ విజ్ఞాన ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి. విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందము, యాజమాన్యం ఎంతో శ్రద్ధాసక్తులతో ఈ కార్యక్రమ నిర్వాహణలో భాగస్వాములయ్యారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580124
Total Users : 47808