ఆంధ్రప్రదేశ్
ప్రియదర్శినీ బాలవిహార్ లో ఈజీఎఫ్-8

ఏపీ టుడే న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి జైదేవ్ కొత్తపేట (మార్చి 4) అమెరికాలో 2008లో మొదలైన ఇంగ్లీష్ గ్రామర్ డే (ఆంగ్ల వ్యాకరణ దినోత్సం) సంప్రదాయాన్ని ఒక దశాబ్ద కాలంగా తమ స్కూలులోనూ నిర్వహిస్తూ వస్తున్నామని, దీని వల్ల ఇంగ్లీషు గ్రామరు పట్ల పిల్లలు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యంగా గ్రామర్ పట్ల చాలా మంది పిల్లలలో ఉండే భయాన్ని పోగొట్టగలుగుతున్నామని ప్రియదర్శిని బాల విహార్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ అన్నారు.
కేవలం ఒక రోజు జరిగే ఈ కార్యక్రమం ఎన్నో సత్ఫలితాలను ఇస్తూండటం గమనించి ఈ సంవత్సరం మరిన్ని రోజులకు విస్తరిస్తూ మార్చి 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు వరసగా 8 పని దినాలలో ప్రతిరోజు ఒక గంట సమయం ఈ ప్రత్యేక కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నామని ఆయన అన్నారు. ఇంగ్లీష్ గ్రామర్ ఫెస్ట్-8 (EGF-8) పేరుతో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో పిల్లలు తాము ముందుగా నేర్చుకున్న అనేక అంశాలను వివిధ పద్దతులలో ప్రదర్శిస్తారని ఆయన అన్నారు. ఈ 8 రోజుల కార్యక్రమాలలో పిల్లలు స్వయంగా రాసిన చార్టుల ప్రదర్శన, ఇంగ్లీషు గ్రామరు గీతాలు పాడటం, రైమ్స్ చెప్పడం, స్పీచ్ లు ఇవ్వడం, సేయింగ్స్ వివరించడం, స్టోరీ టెల్లింగ్, టెస్ట్ బుక్ రీడింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్, స్పెల్-బి ఇలా అనేకం ప్రకటిస్తారు, ప్రదర్శిస్తారు.
ఈ కార్యక్రమాల మొదటి రోజైన గ్రామర్ డే నాడు ప్రియదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకులు దివంగత అద్దంకి కేశవరావు పిల్లల కోసం రాసిన ప్రొవెర్బ్ ఎక్స్ పేన్షన్స్ అముద్రిత పుస్తకంలోని ఆంగ్ల ప్రసిద్ధ సామెతలైన “వెరైటీ ఈస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్”, “క్యారెక్టర్ ఈస్ ఫేట్”, “నో పైన్ నో గైన్”, “హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ”, “వేర్ దేరీజ్ ఎ విల్ దేరీజ్ ఎ వే”, “ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్” వంటి దాదాపు 30 ప్రొవెర్బ్స్ (విలువైన నానుడులు) ను విడమరచి అర్ధవంతంగా చెప్పారు. స్కూల్ లైబ్రరీ బుక్స్ ను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేసారు. వీటిలో చాలా వరకు లైబ్రరీ పీరియడ్ లో పిల్లలు చదివిన పుస్తకాలే కావడం విశేషం.
5న నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ డే, 6న వెర్బ్స్ అండ్ టెన్సెస్ డే, 7న ప్రిపొజిషన్స్ అండ్ కంజంక్షన్స్ డే, 10న ఏడ్జక్టివ్స్ అండ్ ఏడ్వర్బ్స్ డే, 11న ఇంటర్జక్షన్స్ అండ్ పంక్యుయేషన్స్ డే, 12న ఆర్టికల్స్ అండ్ జెండర్స్ డే, 13న సినొనిమ్స్ అండ్ ఏంటొనిమ్స్ డే జరుపుతామనీ అన్నీ కూడా వాల్యూ ఎడ్యుకేషన్ లో భాగంగా జరుపుతామని స్కూల్ అకడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య అన్నారు. ఏమి జరిపినా విలువలతో కూడిన ఉదాత్తమైన ఉన్నత ప్రమాణలతో కూడిన విద్యను పిల్లలకు అందించే సదుద్దేశంతో జరుపుతున్నామని ఆమె అన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక