Connect with us

ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం… మరొక యువకునికి తీవ్రగాయాలు… సుంకరపాలెంలో ఉద్రిక్తత.

Published

on

ఎక్సైజ్ పోలీసులు వెంబడించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన బైక్ ఎక్సైజ్ చెక్పోస్టును ముట్టడించిన స్థానికులు-సిబ్బంది నిలదీత సుంకరపాలెంలో ఉద్రిక్తత

ఏపీ టుడే న్యూస్ తాళ్లరేవు మండలం (మార్చి 8) యానాం-ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొక యువకునికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్ (21), పిఠాపురం గ్రామానికి చెందిన మరొక యువకుడు పెద్దాపురంలోని ఒక కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వచ్చి తిరిగి వెళుతుండగా మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అయితే వారు బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఎక్సైజ్ పోలీసులు వారిని వెంబడించారు. దీంతో వేగంగా బైక్ను నడుపుతూ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కోట శ్రీరామ్కు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఇలా ఉండగా మరొక యువకుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. యువకుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఎక్సైజ్ చెక్పోస్టు వద్దకు చేరుకుని ముట్టడించారు. ఎక్సైజ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలై పోయిందని సిబ్బందిని నిలదీసారు. అయితే తాము వెంబడించలేదని సిబ్బంది చెప్పడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

ఎక్సైజ్ పోలీసులు వెంబడించడం కళ్లారా చూసామని స్థానికులు తెలిపారు.

 

డిపార్ట్మెంట్కు సంబంధంలేని ఒక ప్రైవేటు వ్యక్తిని మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టి వారు ఇచ్చిన సమాచారంతో ప్రతీరోజూ ఇదే మాదిరిగా వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. ఈ రోజు వారి నిర్వాహకం కారణంగా అభం శుభం తెలియని యువకుడు బలైపోయాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. యువకుడి మృతికి కారకులైన ఎక్సైజ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేసారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యన్నారాయణ సుంకరపాలెం చెక్పోస్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు.

ఎక్సెజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళీ,,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ మౌనిక,,ఎక్సైజ్. సీఐ స్వామి,కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ,,కాకినాడ త్రి టౌన్ సిఐ సత్యనారాయణ,,ఇంద్రాపాలెం ఎస్ఐ.వీరబాబు,,గోళ్ళపాలెం ఎస్ఐ .మోహన్ కుమార్,,తిమ్మాపురం ఎస్ఐ.రవీంద్ర,,పాల్గొన్నారు..

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580184
Total Users : 47868