ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో పవిత్ర రంజాన్ పండుగ ..
పేదలకు దానధర్మాలు చేయడమే ఇస్లాం ముఖ్య ఉద్దేశం ..
పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి ..
కడప జిల్లా/జమ్మలమడుగు ఏపీ టుడే న్యూస్ ( మార్చి31):
నీరు పేదలకు దానధర్మాలు చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని జమ్మలమడుగు ఆస్థాన ఏ కమాలియ జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. ఈ రోజు జమ్మలమడుగు పట్టణం లోని పెన్నానది ఒడ్డున గల షాహి ఈద్గా ఆవరణంలో జమ్మలమడుగు పట్టణం మరియు మండల పరిధిలోని వేలాది మంది ముస్లిం సోదరులు, చిన్నారులతో కలిసి పవిత్ర రంజాన్ పండుగ నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగ నమాజు చదివారు. అనంతరం ప్రసంగిస్తూ పవిత్ర రమజాన్ విశిష్ఠత మరియు పవిత్ర రంజాన్ మాసంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా పేద సాదలకు తమ శక్తిమేర సహాయ సహకారాలు చేయడం, ఇతరులతో కలిసి మెలిసి వెలగడం, ప్రతిరోజూ 5 పూటలా నమాజు చదవడం, ఉపవాసాలు పాటించడం ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అనంతరం రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పాటించిన ఉపవాస దీక్షలకు మానవులు జీవిత కాలంలో చేసినపాపాలు ప్రక్షాళన చేయాలని యావత్ ముస్లింల కోసం ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కుటుంబీకులు, గురువులు ముస్లిం మైనారిటీ నాయకులు,ముస్లింసోదరులు, చిన్నారులు పవిత్ర రంజాన్ పండుగ నమాజుఆచరించారు. నమాజు అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని ప్రతి ఒక్కరూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.


-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67847