Connect with us

ఆంధ్రప్రదేశ్

ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక

Published

on

 

ఏపీ టుడే న్యూస్ తాళ్లరేవు మండలం ( మార్చ్ 31).

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల అనంతరం ఒకచోట కలుసుకుని ఆనందంగా గడిపారు. ఇంజరం శ్రీ చోడవరపు అప్పన్న మెమోరియల్ హైస్కూల్ లో 1994-95వ సంవత్సరంలో టెన్త్ చదివిన విద్యార్థులు 30 ఏళ్ల తరువాత అదే స్కూల్ లో కలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో గుర్తుపట్ట లేనట్లుగా ఉన్న వారిని చూసి ఓకెంత ఆశ్చర్యాన్ని గురయ్యారు. ఒరేయ్ రమేష్, హాయ్ సూర్య కుమారి ఎలా ఉన్నావ్ ఏం చేస్తున్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చిన్న నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలా సంత్సరాల తరువాత ఈ విధంగా స్నేహితులను కలుసుకోవడం మధురానిభూతిని కలిగించిందన్నారు. తమ స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తామన్నారు. మరోసారి కుటుంబ సమేతంగా కలవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులను దుస్సాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమానికి హాజరైన ఇంజరం గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరామ ప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ ఇలా కలుసుకుని విద్య నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాగే ప్రతీ ఏటా కలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి రమేష్, బళ్ళ దుర్గేశ్వరరావు,, వీళ్ళ సూరిబాబు,, చింతాకుల శ్రీనివాస్,, సేలం చిన్న నరసింహారావు,, కొప్పిశెట్టి శ్రీనివాస్,, లంక వెంకట్రాజు, శెట్టి సూర్యప్రకాష్, కంచుకూరి మల్లేశ్వరరావు, మారెళ్ళ సూర్యకుమారి, మేడిశెట్టి పుణ్యవతి, కొప్పవరపు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580156
Total Users : 47840