ఆంధ్రప్రదేశ్
హౌసింగ్ బోర్డ్ ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులో అగ్నిప్రమాదం
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అగ్నిప్రమాదం
ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నందు శుక్రవారం సాయంత్రం బ్యాంక్ విధులు ముగిసి తాళం వేసిన తర్వాత దాదాపు 7 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు గమనించి అగ్నిమాపక కేంద్రానికి చరవాణి ద్వారా తెలిపారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది బ్యాంకు వద్దకు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పాక్షికంగా బ్యాంకులోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు తెలియవస్తోంది. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియ రావలసి ఉంది.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87378