ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్: ఆగస్టు 06
పత్రికల్లో పనిచేసే వారికి ప్రభుత్వ గుర్తింపు అక్రిడి టేషన్ కార్డుల జారీలో చిన్న పత్రికలను ఎ, బి, సి, డిలుగా విభజించడం చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది.
దీనికి సంబంధించి జీవో 239 షెడ్యూలు-ఇలోని నిబంధలను కొట్టివేసింది. అక్రిడిటేషన్‌కు సంబంధించి 2016లో జారీచేసిన జీవో లోని నిబంధనలు వివక్షా పూరితంగా ఉన్నాయని, వాటిని కొట్టివేయా లంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన టి.కృష్ణ మరో ముగ్గురు 2016లో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.పిటిష నర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం రూపొందించిన నిబంధనల వల్ల చిన్నపత్రిక ల్లో పనిచేసే జిల్లా, నియోజ కవర్గ స్థాయి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ప్రయోజనాలు లభించడం లేదన్నారు.
వాదనలు విన్న ధర్మాసనం చిన్న పత్రికలను విభజించ డానికి ప్రభుత్వం సహేతుక కారణాలను పేర్కొనలేదని, ఆ నిబంధనలు చెల్లవని స్పష్టం చేసింది.
రెండు నెలల్లో చిన్న పత్రికల జిల్లా, నియోజకవర్గ విలేక రులకు ప్రయోజనం కలిగిం చేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక