ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆత్రేయపురం మండలం
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తిగా కుంటి పడ్డాయని, గ్రామాల్లోకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక, త్రాగేందుకు రక్షిత మంచినీరు లేక గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, దశలవారీగా అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికపై ప్రణాళికలు సిద్ధం చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం తాడిపూడి గ్రామంలో ఎమ్మెల్యే బండారు స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. ప్రస్తుతం ప్రజలకు సీజనల్ వ్యాధులు సోకే కాలమని, గ్రామ వీధుల్లో ప్రతిరోజు బ్లీచింగ్ చెల్లించి, డ్రైన్లను ఏరోజుకారోజు శుభ్రపరచాలని, రక్షిత మంచినీరుని ప్రజలకు అందించాలని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇల్లులు నిర్మించుకుని బిల్లులు రాని వారి వివరాలు సేకరించాలని స్థానిక నాయకులను కోరారు. గ్రామ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఉండే సమస్యలను గుర్తించి వాటి పరిష్కార దిశగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రెసిడెంట్ ముదునూరి వెంకటరాజు(గబ్బర్ సింగ్ ), కరుటూరి నరసింహరాజు,పెరిచర్ల భీమరాజు,వాకాడ గంగాధర్,కుసంపూడి రామకృష్ణరాజు (బాబు),కుసంపూడి రమేష్ రాజు, పెరిచర్ల సత్యనారాయణ,పత్సమట్ల శ్రీనివాసరాజు, దండు రాంబాబు,అంబుల శ్రీనివాసరావు, పాలంగి రవిచంద్ర, మట్ట బుజ్జి, యుజ్జవారపు శ్రీహరి, త్రినాధ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక