ఆంధ్రప్రదేశ్
వాడపల్లి అభివృద్ధి మనందరి బాధ్యత అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కోత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు
రిపోర్టర్: జైదేవ్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆత్రేయపురం మండలం
కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి ఆలయాన్ని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు.
వారు ఇరువురు శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని, పవిత్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు.


అనంతరం ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అర్చక స్వాముల క్వాటర్స్, సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులను అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, కొత్తపేట శాసనసభ్యులు సత్యానందరావు లు ప్రారంభించారు.
గ్రామంలోని ఏటి గట్టు వద్ద లోల్ల వరకు నిర్మిస్తున్న రహదారికి శంకుస్థాపన చేసి,శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎందరో భక్తులు స్వామి వారి మీద అచంచల విశ్వాసంతో వాడపల్లి వచ్చి ఏడు శనివారాల మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. తిరుమల తరువాత కోనసీమ తిరుపతిగా వాడపల్లి అంతటి ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్రం మీద ఉండాలన్నారు.
వాడపల్లి ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో వాడపల్లిని ఐకానిక్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు.
ఈ కార్యక్రమం లో ఆకుల రామకృష్ణ,ముదునూరి వెంకటరాజు, కాయల జగన్నాధం, కరుటూరి నరసింహారావు, చిలువూరి సతీష్ రాజు, ధరణాల రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67959