ఆంధ్రప్రదేశ్
11సీట్లకు దిగజారినా వైసిపికి బుద్ది రాలేదు : ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

కడప జిల్లా
ప్రొద్దుటూరు
ఓడిపోయినా బుద్దిరాలేదు
– బంగారు రెడ్డిపై ఎమ్మెల్యే వరద
– నా జీవితకాలంలో నాపై అవినీతి చూపలేరు
– వైఎస్సార్ పార్టీది అవినీతి ఎజెండా..మాది అభివృద్ధి ఎజెండా
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,ఆయన బావమరిది బుద్ధిలేని మునిసిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హెచ్చరించారు.ఇటీవల ప్రొద్దుటూరు పోలీసులు పట్టుకున్న ఇసుక టిప్పర్లపై ఎన్.వి.ఆర్.ఆర్ అని ఉండడం చూసి అవి నావి అని,వాటి ద్వారా ఇసుక అక్రమ రవాణా తన సోదరులు,కుమారులు చేస్తున్నట్లు బుద్ధిలేని మునిసిపల్ వైస్ చైర్మన్ బంగారు రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు.అయితే అవి తనకు ఏమాత్రం సంబంధంలేని టిప్పర్లు అని కమలాపురంకు చెందినవి అయితే తన టిప్పర్లు అని ప్రచారం చేయడం సహేతుకం కాదు అన్నారు.ఇసుక అక్రమ రవాణా,గ్యాంబ్లింగ్,గుట్కా,మట్కా,క్రికెట్ పందేలు లాంటి అసాంఘిక కార్యక్రమాలపై తన మన భేదం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పామని అన్నారు.ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు,భూ దందాలు చేసి వేల కోట్లు సంపాదించి,అందరూ అలాంటి చర్యలకు పాల్పడతారు అనే అపోహలో ఉన్నారని అన్నారు.నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెలుగుదేశం నాయకులు పాల్పడరని అన్నారు.2019 లో 151 సాధించి కేవలం అయిదేళ్ల కాలంలో 11 సీట్లకువైఎస్సార్ పార్టీ దిగజారడానికి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడడమే అన్నారు.అయినా బుద్ది రాలేదు అన్నారు.తన జీవిత కాలంలో ఏ అవినీతి మచ్చ చూపలేరు అని చాలెంజ్ చేశారు.తన దగ్గర మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,ఆయన అన్న కిరణ్,బావ మరిది బంగారు రెడ్డి 20 సంవత్సరాలు కొనసాగారు అని తన గురించి తెలిసి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తగదు అన్నారు.ప్రభుత్వం మారినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వైఎస్సార్ పార్టీ నేర్పిన అవినీతి బుద్దులు మారలేదన్నారు.తప్పు ఎవరు చేసినా వుపెక్షించే పరిస్థితే లేదన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక