ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్యం పనులు వేగవంతం
ఏపీ టుడే న్యూస్, బ్యూరో కర్నూల్ సిటి
• నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్
• తాగునీటి సరఫరా కలుషితం కాకుండా పర్యవేక్షణ

నగరంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసినట్లు నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ తెలిపారు. బుధవారం 1వ శానిటేషన్ డివిజన్ పరిధిలో కండేరి వీధి, సాయిబాబా నగర్, కొత్తపేట ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టి ఉంచుకుని పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు మరింత మెరుగు పరుచుకోవాలని కోరారు. రహదారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, మురుగు నీటి కాలువల్లో చెత్తాచెదారం వెనువెంటనే తొలగిస్తూ ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వరద సహాయక చర్యల కోసం ప్రజారోగ్య విభాగం నుండి 100 మంది కార్మికులు, నలుగురు ఇంస్పెక్టర్లు, 16 మంది కార్యదర్శులు విజయవాడ వెళ్ళారని, నగరంలో వారు పనిచేస్తున్న ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరు తక్షణమే తొలగిస్తున్నట్లు తెలిపారు. పైప్‌లైన్ల క్రాసింగ్‌తో పాటు ఇతరత్రా చోట్ల తాగునీరు కలుషితం కాకుండా ఎమినిటీస్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, ఇంస్పెక్టర్లు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67978