Connect with us

ఆంధ్రప్రదేశ్

ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా.? జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో.

100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను అధిగమించండి.

ఉపాధి హామీ పనుల లేబర్ బడ్జెట్, ఇళ్ల నిర్మాణాల పురోగతి, పంట నష్ట నమోదు, ఈ క్రాప్ బుకింగ్, ఓడిఎఫ్ ప్లస్ సర్వే తదితర అంశాలలో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్రస్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా .? అని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతిపై లక్ష్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లా ప్రగతి లక్ష్యసాధనలో అప్పగించిన పనులు పూర్తి చేయడంలో అలక్ష్యం చేస్తున్నారని. ఏ ఒక్క అధికారికి నేను ముందుండాలి అనేది ఉండదా.? అని కలెక్టర్ ప్రశ్నిస్తూ మనసు పెట్టి పని చేయాలని అధికారులను ఆదేశించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ పనులకు కేటాయించిన లేబర్ బడ్జెట్ ఆత్మకూరు క్లస్టర్ పరిధిలోని అన్ని మండలాలలో తక్కువగా ఉందని, పనితీరు మెరుగుపరచుకొని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల తదితర మండలాలలో ఉపాధి హామీ కింద 1,100 ఎకరాలలో చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్, బ్లాక్ ప్లాంటేషన్ కింద మొక్కల పెంపకానికి సంబంధించి పిట్టింగ్, కంచే ఏర్పాటు ప్రతిదానికి ఉపాధి హామీ కింద డబ్బులు ఇచ్చినా పనులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు. ఇళ్లు నిర్మాణంలో ఉన్నప్పుడు 90 రోజుల పని దినాలకు సంబంధించి పొజిషన్ సర్టిఫికెట్ అడగాల్సిన అవసరం లేదని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతికి సంబంధించి ప్రతి మండలంలో రోజుకు రెండు ఇళ్ళు పూర్తి స్థాయి, పది ఇళ్ళు స్టేజ్ కన్వర్షన్ కు తీసుకురావాలని ఆదేశించినప్పటికీ అత్యల్ప ప్రగతి చూపుతున్నారన్నారు. వందరోజుల ప్రణాళికలో 3,413 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 608 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగారన్నారు. కొత్తపల్లి, నందికొట్కూరు, పగిడ్యాల, బేతంచెర్ల, ప్యాపిలి తదితర మండలాలలో తక్కువ ప్రగతి కనిపిస్తోందని ఈ వారం చేస్తామని ప్రతిసారి చెప్పడం సరికాదని కలెక్టర్ తెలిపారు.
అన్నం పెట్టే రైతుకు సపోర్ట్ ఇచ్చేందుకు పంట నష్ట వివరాలను మంగళవారం ఉదయంలోగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ వ్యవసాయ రంగ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. 4.6 లక్షల ఎకరాలకు సంబంధించి 1.2 లక్షల రైతుల ఈ కేవైసి సంబంధించి కేవలం 41 వేల మందికి మాత్రమే పూర్తి చేశారని ఇంకా 1.10 లక్షల మంది రైతుల ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని ఇందుకు సంబంధించి గ్రామ వ్యవసాయ అధికారులు, వీఆర్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గోస్పాడు, బనగానపల్లి, శిరివెళ్ల, బండి ఆత్మకూరు తదితర మండలాలలో తక్కువ ప్రగతి ఉందని పంట నష్ట నమోదు, ఈక్రాప్ బుకింగ్ ఏకకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద పెండింగ్ లో వున్న దరఖాస్తులు పరిశీలించి వాస్తవ నివేదికలను వెంటనే పంపాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. డేటా బేస్ ప్రకారం పల్స్, ఓడిఎఫ్ ప్లస్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. 151 సంక్షేమ వసతి గృహాల్లో తనిఖీల నిమిత్తం స్పెషల్ అధికారులను నియమించామని సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా హాస్టల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో ఉన్న వసతులను క్రమ పద్ధతిగా వినియోగించుకుంటూ వసతి గృహాలను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
600292
Total Users : 67976