ఆంధ్రప్రదేశ్
నిరుపేద విద్యార్థినికి కలెక్టర్ చేయూత

ఐఐటి పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థినికి ల్యాప్ టాప్ అందచేసిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
నిరుపేద విద్యార్థిని ఐఐటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు పేదరికం అడ్డురాకూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా విద్యార్థిని డి.హాసినికి ల్యాప్ టాప్ అందచేసి చేయూతను అందించారు.
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు నగరం విఠల్ నగర్ లో నివాసం ఉంటున్న డి.హాసిని అనే విద్యార్థినికి తండ్రి లేరు..పేదరికంలో ఉన్న తల్లి శారదమ్మ కష్టపడి తన కూతురును సర్వేపల్లి రాధాకృష్ణ పాఠశాలలో చదివించింది.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హాసిని 600 మార్కులకు గాను 530 మార్కులు సాధించింది. గాయత్రి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 కి గాను 437 మార్కులు సాధించింది..
ఐఐటి పరీక్షలకు సిద్ధం అవుతున్న హాసిని పేదరికం కారణంతో ల్యాప్ టాప్ కొనలేకపోతున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ల్యాప్ ట్యాప్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంటనే స్పందించి కెనరా బ్యాంక్ ద్వారా సిఎస్ఆర్ నిధులతో ల్యాప్ ట్యాప్ ను మంజూరు చేయించి హాసినికి అందచేసారు..
ఈ సందర్భంగా ఇంటర్ రెండవ సంవత్సరం మరింత బాగా చదివి పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ హాసినిని ప్రోత్సహించారు..ఐఐటి లో సీటు సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. అలాగే కష్టపడి చదివిస్తున్న తల్లి శారదని జీవితంలో బాగా చూసుకోవాలన్నారు.. బాగా చదివే విద్యార్థులకు పేదరికం అడ్డుకాకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, ఎల్డిఎమ్ రామచంద్రరావు, ఎస్సి కార్పొరేషన్ ఈడి తులసి దేవి, విద్యార్థిని తల్లి శారదమ్మ తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక