ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు నాయుడు పాలన అందరికీ ఆదర్శవంతం: రాష్ట్ర మంత్రి టీజీ భరత్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
చంద్రబాబు నాయుడు పాలన అందరికీ ఆదర్శవంతం: రాష్ట్ర మంత్రి టీజీ భరత్
చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారని.. నీతి, నిజాయితీ, చట్టబద్దత, పారదర్శకత ఆయన ప్రత్యేకత అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరూ ఖండించారని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని.. దేశవ్యాప్తంగా మద్దతు పలికారని చెప్పారు. అరెస్టు అయిన ఏ రాజకీయ నేతకు ఇలాంటి సంఘీభావం రాలేదంటే అతిశయోక్తి కాదన్నారు. 4 దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ఎటువంటి మచ్చ లేని చంద్రబాబునాయుడుని వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేసి ఏడాది అయిన నేపథ్యంలో మంత్రి టి.జి భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏ తప్పూ చేయకపోయినా అవినీతికి పాల్పడినట్లు, ఎటువంటి ఆధారం లేకపోయినా వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మంత్రి టీజీ భరత్ అన్నారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అక్రమ అరెస్టులుగా గత అయిదేళ్ల పాలన సాగిందన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 70 దేశాల్లో తెలుగు ప్రజలు ఉప్పెనలా నిరసన తెలియజేశారని గుర్తు చేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్‌లో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి అని, ఆ తర్వాత రూ.300 కోట్లు అని, ఆ తర్వాత రూ.30 కోట్లు అని.. చివరికి 3 పైసలు కూడా అవినీతికి పాల్పడినట్లు నిరూపించలేకపోయారని మంత్రి భరత్ అన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67967