ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్షల కొరత -ఏ పరీక్ష చేయించుకోవాలన్నా బయటికి వెళ్లాల్సిందేనా ?

కడప జిల్లా
జమ్మలమడుగు(ఏపీ టుడే ప్రతినిధి)( సెప్టెంబర్ 10):
జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి, ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్న మెడికల్ సూపరింటెండెంట్ రక్త పరీక్షల నిర్వహణలో మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో పేరుకు మాత్రమే రక్త పరీక్ష నిర్వహించే ల్యాబ్ ఉంది. కానీ అందులో అన్ని రకాల రక్త పరీక్షలు చేసే దానికి పరికరాలు ఉన్నాయి కానీ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ , లివర్ ఫంక్షన్ టెస్ట్, రీనల్ ప్రొఫైల్ టెస్ట్ , హెచ్.బీ ఏ1సి ప్రైవేట్ ల్యాబ్ లకు పంపిస్తున్నారు. ఆర్థో పెడిక్ డాక్టర్ ఉన్నా కూడా ఆర్.ఏ, ఎ.ఎస్.ఓ పరీక్షలు ఎందుకు చెయ్యడం లేదు. చిన్నపిల్లలకు సి.బి. పి, సి.అర్.పి తదితర రక్త పరీక్షలు నిర్వహించాలంటే తమ దగ్గర పరికరాలు లేవని ఏలాంటి కిట్లు లేవని ల్యాబ్ నిర్వాహకులు చెబుతున్నారు, సి ఆర్ పి రక్త పరీక్షలు బయట ప్రైవేట్ ల్యాబ్ కు పంపిస్తున్నారు ఈ విషయంపై వైద్యులను రోగులు మరియు ప్రజలు వెళ్లి ప్రశ్నించగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు తమ వద్ద పరికరాలులేవని బయటికి వెళ్లి ప్రైవేటు ల్యాబ్ వద్ద పరీక్షలు చేయించుకుని రావాలని రాస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వద్దకు వెళ్ల లేము కాబట్టే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని, మీరు ఇలా చెబితే ఎలాగని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మందులు రావడం లేదని ఉంటే చేయమా అంటూ రోగులపై వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. కానీ ఇదే అదునుగా చూసుకొని వైద్యులు ల్యాబ్ నిర్వహకులు కుమ్మక్కై కమిషన్లకు ఆశపడి ప్రభుత్వాసుపత్రికి వచ్చే అన్ని రకాల వైద్య పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్ ల వద్దకు పంపిస్తున్నారని చెబుతున్నారు.ఈ అరాచకాన్ని అరికట్టి తమకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక