ఆంధ్రప్రదేశ్
క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు అనుభవజ్ణుడు.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
వరద బాధితులకు 8 వేల నిత్యావసర కిట్లు పంపిణీ చేసిన మంత్రి టి.జి భరత్
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలో తెలిసిన అనుభవజ్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. విజయవాడలోని ఊర్మిళా నగర్‌లో వరద బాధితులకు మంత్రి టి.జి భరత్ నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. మంత్రి టి.జి భరత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలందరూ కలిసి 8 వేల నిత్యావసర కిట్లను విజయవాడకు తీసుకొచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, నాయకులతో కలిసి వరద బాదితులకు నిత్యవసర సరుకుల కిట్లను మంత్రి అందజేశారు. వరద బాధితుల వద్దకు వెళ్లి టి.జి భరత్ మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరుపున అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలందరూ కలిసి 80 లక్షలు విలువచేసే 8 వేల కిట్లను తయారుచేయించామన్నారు. ప్రతి కిట్‌లో 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో ఉప్మారవ్వ, కిలో గోదుమపిండి, కిలో నూనె, సర్ఫ్ ప్యాకెట్, సబ్బు, జీలకర్ర, ఆవాలు, చింతపండు ఉంటాయని తెలిపారు.
విజయవాడలో వరదలు రావడం ఎంతో బాధాకరమని మంత్రి టి.జి భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఎలా రక్షించాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఆయనకున్న అనుభవం వల్ల వరదల నుండి ప్రజలను త్వరగా బయటకు తీసుకొచ్చామన్నారు. వరదల సమయంలో కింది స్థాయి అధికారులు పనిచేస్తే చాలని ఆలోచించకుండా తానే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షించిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని మంత్రి టి.జి భరత్ చెప్పారు. వరదల నుండి ప్రజలను రక్షించేందుకు చంద్రబాబు నాయుడు సైనికుడిలా పనిచేశారన్నారు. ప్రజల కోసం నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేసిన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేరన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వేలాది మంది ప్రాణాలు పోయేవి కావన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ప్రజలందరి ఆశీస్సులు ఆయనపై ఉండాలని మంత్రి టి.జి భరత్ అన్నారు. వైసీపీ నేతలు వరద బాధితులకు చేసిన సహాయం ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే వారి పని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బి.వి జయనాగేశ్వరరెడ్డి, కే.ఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బి.టి నాయుడు, కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, వీరభద్ర గౌడ్, నాగేశ్వర్ యాదవ్, తుగ్గలి నాగేంద్ర, కార్పొరేటర్ పరమేష్, కర్నూలు జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక