Connect with us

ఆంధ్రప్రదేశ్

రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు

Published

on

గ్రామాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ప్రోత్సాహం*

ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ది పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్, రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి…పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈ ల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి..వాటికి చేయూతను ఇస్తుందని సిఎం అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని సిఎం అన్నారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి…వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రలమ ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సిఎం అన్నారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్ లు ఏర్పాటుచేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ది చేకూర్చామో…అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటులోను అవలంభించాలన్నారు. పూణె వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా….అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సిఎం అదేశించారు. నిర్థేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారి అయినా, విభాగం అయినా అనుమతి ఇవ్వకపోతే….ఆటోమేటిక్ గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే…..చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఇలతో అనుసంధానం చేయాలని…వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పరిశ్రమల ఇన్సెంటివ్స్ ను ఇవ్వాల్సిన అవసరం ఉందని…దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యచరణ అమలు చేయాలన్నారు. ఆటోనగర్లను మోడ్రనైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని సిఎం అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లష్టర్లను పూర్తి చెయ్యాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారెంటీకి రూ. 100 కోట్లు కేటాయిస్తామని సిఎం తెలిపారు. విశ్వకర్మవంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
600292
Total Users : 67976