ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో మహమ్మద్ ప్రవక్త జ్ఞపికలకు గంధోత్సవం .. (వీడియో)

కడప జిల్లా
జమ్మలమడుగు:సెప్టెంబర్15:
ఈనెల 16వ తేదీ సోమవారం మీలాదున్నవి పండుగ రోజున మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త పవిత్ర జ్ఞాపికలకు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్ షా సాదిక్ పాషా ఖాద్రి భక్తులతో కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో గందోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా పీఠాధిపతి మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర జ్ఞాపికలకు గందోత్సవం నిర్వహించి ప్రత్యేక ఫాతిహానిర్వహించారు. అనంతరం గురువులు, ఫకీర్లు ముస్లిం సోదరులు,చిన్నారులు ప్రతి ఒక్కరూ ప్రవక్త జ్ఞాపికలకు భక్తిశ్రద్ధలతో గంధోత్సవం నిర్వహించారు. అంతకు ముందు పీఠాధిపతి ఇంటి నందు ఫకీర్లు మేళ తాళాలతో మహమ్మద్ ప్రవక్త పై కీర్తనలు ఆలపిస్తూ గొప్ప మేళా నిర్వహించారు. గందోత్సవం తర్వాత ముస్లిం సోదర సోదరీమణులు తాము జీవిత కాలంలో చేసినతప్పులు మన్నించి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. గందోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురువులు సయ్యద్ షా అసద్ పాషా ఖాద్రి, పీఠాధిపతి సోదరులు, కుటుంబీకులు, ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటోరైటప్: 01ప్రవక్త జ్ఞాపిక లకు గందోత్సవం నిర్వహిస్తున్న పీఠాధిపతి,
02: గందోత్సవంలో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులు
-
జాతీయం7 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక