ఆంధ్రప్రదేశ్
ఆత్మ హత్య చేసుకున్న ఉపాధ్యాయుడు.ఖలీల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వము ఆదుకోవాలి.
ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలు, ఆత్మహత్యలు మత్తు పదార్థాల వ్యసనాలతో చెడిపోతున్న ప్రజలను పోలీసు యంత్రాంగంవాటిని అరికట్టి ప్రజలప్రాణాలను కాపాడాలి. సిపిఐ.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
జిల్లాలోఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్న ప్రజలు మత్తు పదార్థాల వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు హత్యలు చేసే స్థాయికి యువత చెడు దారి పట్టిందని, వీటిని అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ వాటిని అరికట్టే దిశలో దిష్టి సారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడు ఖలీల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు ఒకప్రకటన లో తెలిపారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శిఎన్.రంగనాయుడు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శియస్.బాబా ఫక్రుద్దీన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
రాష్ట్రంలో రోజురోజుకు ఆన్లైన్ మోసాలు మత్తు పదార్థాల వల్ల ప్రజలు యువత ఆకర్షితులై బానిసలుగా తయారవుతున్నారని, మరోవైపు అధిక వడ్డీలు తెచ్చుకొని వాటిని తట్టుకోలేక ఆత్మహత్య వైపు మళ్ళీ వారి జీవితాలను కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు .ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఆన్లైన్ మోసాలను అరికట్టాలని ప్రయత్నించిన పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయని వాటిని అరికట్టడం లో పోలీస్ వ్యవస్థ సరైన నిర్ణయాలను తీసుకోక పోవడమేనని విమర్శించారు.
జిల్లా కేంద్రమైన నంద్యాలలో ఆన్లైన్ మోసాలతో యువకుడు ఆర్టిఓ ఏజెంట్, కరిముల్లా, ఉపాధ్యాయుడు ఖలీల్ ఆత్మ హత్యలు చేసుకోవడం అధిక వడ్డీల వల్ల మున్సిపల్ కార్మికుడు దొంగతనం నేరంతో అబ్దుల్ సలాం కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని ఇటువంటి సంఘటనలు జరుగుతున్న ప్రజలు వాస్తవాలు తెలుసుకోకుండా మోసపోతున్నారని ఆవేదనతో తెలిపారు.
పోలీసు వ్యవస్థను ఇప్పటికైనా గాని వీటిని అరికట్టే దిశలో ప్రయత్నించి ప్రజలను ఇలాంటి మోసాలకు మోసపోకుండా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఐ నాయకులు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477