ఆంధ్రప్రదేశ్
వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
నగరంలో వార్డుల్లో అత్యవసరమైన రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం వంటి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శనివారం 40వ వార్డులో కార్పొరేటర్ ఎం.విక్రసింహా రెడ్డితో కలిసి విసృతంగా పర్యటించారు. ప్రజల నుండి దృష్టికి వచ్చిన, కార్పొరేటర్ తెలిపిన పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ సాయిబాబా గేరి, ప్రకాశ్ నగర్, బంగార పేట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అలాగే తుంగభద్ర నది తీరాన పర్యటించి, ఎస్టీపికి అనువైన ప్రదేశం ఎంపిక కోసం చర్చించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి విశ్వేశ్వర రెడ్డి, శానిటేషన్, సూపర్వైజర్ నాగరాజు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మురళీమోహన్, డిఈ నరేష్, ఏఈ దినేష్, ఏసిపి రంగస్వామి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ షబ్రీశ్, శానిటేషన్ ఇంస్పెక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466