ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” ఫిర్యాదులను నిర్ణిత సమయం లోపల పరిష్కరించండి. పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ .
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం (23 -09-2024) నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (P.G.R.S) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన సుమారు 135 ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఈ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యాక్రమంలో సివిల్ తగాదాలు, అత్తారింటి వేధింపులు,కుటుంబ కలహాలు,అన్నదమ్ముల ఆస్థి పంపకాలలో మనస్పర్దలు మొదలగునవి ఉన్నాయి.
ఈ కార్యక్రమం లో సిఐ లు మోహన్ రెడ్డి , ఏరిషా వలి , ఆదినారాయణ రెడ్డి , నిరంజన్ రెడ్డి , ప్రియతమ్ రెడ్డి , యువరాజు , సురేష్ మరియు సిసి నాగరాజు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68164