ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిద్దాం….. రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు.
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు.

స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సూచనల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ టైగర్ ప్రాజెక్ట్ ఐఎఫ్ఎస్,అనురాగ్ మీనా ఆదేశాల మేరకు రుద్రవరం రేంజ్ కార్యాలయ పరిసరాలలోని ప్లాస్టిక్ మరియు వ్యర్ధ పదార్థాలను తొలగించడమైనది. ఇందులో భాగంగా గాంధీ జయంతికి 15 రోజులు ముందుగా అనగా (17 వ తేది సెప్టెంబర్ 2024 నుండి అక్టోబర్ రెండవ తేదీ 2024) వారి ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశముతో స్వచ్ఛత మరియు పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించడమైనది.ఈ సంవత్సరము ముఖ్య నినాదం మానవ మనుగడ కొనసాగించాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చు కోవడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కనీసము ఒక మొక్కను నాటి సంరక్షించాలని, గ్రామ పరిసరాలను అన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛహిత సేవా కార్యక్రమాల్లో భాగంగా పిలుపునివ్వడమైనది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ ను వాడరాదని ,100% ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సాధించాలని, ప్రతి ఒక్కరూ గ్రామ వీధులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్ ముర్తుజావలి మరియు రేంజ్ సిబ్బంది పాల్గొనడం అయినది.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67896